దేశవ్యాప్తంగా హై అలెర్ట్
పాకిస్థాన్ పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాది దాడి ఘటనతో భారత్ అప్రమత్తమైంది. దాంతో భద్రతను మరింత
కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో అధికారులు హై అలెర్ట్ ను ప్రకటించారు.
జనవరి చివరకు దేశం మొత్తం కేంద్ర హోం శాఖ అలెర్ట్ ప్రకటించింది. అలాగే అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
షాపింగ్ మాల్స్, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్స్, థియెటర్లు తదితర రద్దీ ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. దేశంలోని అన్ని స్కూల్స్, కేంద్ర విద్య విద్యాలయాల్లో సెక్యూరిటీని పెంచాలని సూచించింది. అదేవిధంగా దేశంలో ఉన్నలోనున్న అన్ని విమానాశ్రయాలలోను భద్రతను పటిష్ట పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర హోం శాఖ.
No comments:
Post a Comment