Wednesday, 17 December 2014

నో మోర్ పాలిటిక్స్ అంటున్న బిగ్ బీ

నో మోర్ పాలిటిక్స్ అంటున్న బిగ్ బీ

  big b రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేశానని, రాజకీయాలు తనకు సరిపడవని తెలుసుకున్నాక వాటి నుంచి బయటపడ్డానని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అన్నారు.

తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 1984లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన అమితాబ్, మూడేళ్లకే పదవికి రాజీనామా చేశారు.
అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పట్లోని తన భావోద్వేగాలు తనను రాజకీయాల వైపు నడిపించాయని, నిజ జీవితానికి, భావోద్వేగాలకు వ్యత్యాసం ఉంటుందని తర్వాత తెలుసుకున్నానని అన్నారు.
Share Button

No comments:

Post a Comment