Wednesday, 17 December 2014

శేఖర్‌ కమ్ముల ‘ముకుంద’లో గెస్ట్‌ రోల్‌

శేఖర్‌ కమ్ముల ‘ముకుంద’లో గెస్ట్‌ రోల్‌

  mukunda శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ముకుంద’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఇప్పటికే ఓ మెగా హీరో అతిధిగా కనిపించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది…ఈ చిత్రంలో దర్శకుడు శేఖర్‌ కమ్ముల గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడని ఫిలింనగర్‌ సమాచారం.

ఆనంద్‌, హ్యాపీడేస్‌, లీడర్‌, లైఫ్‌ ఇజ్‌ బ్యూటీఫుల్‌ వంటి ఫీల్‌ గుడ్‌ చిత్రాలు తీసిన దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల ఈ చిత్రలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్నాడంటే విశేషమే.
గత శుక్రవారం విడుదలయిన ముకుంద టైలర్‌ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. వరుణ్‌ తేజ్‌ సరసన పూజ హెగ్దే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్‌ మధులు కలిసి సంయుక్తంగా నిర్మించారు.

No comments:

Post a Comment