గోపాల గోపాల మూవీ క్రొత్త పోస్టర్ రిలీజ్
మొదట మోషన్ పోస్టర్ ని విడుదల చేసి క్రేజ్ చేసిన యూనిట్ … పోస్టర్ తో మరోసారి అందరి దృష్టిలో కి వెళ్తోంది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గోపాల గోపాల ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి ఆదరణ లభించింది. వెంకటేష్ ను పవన్ కల్యాణ్ బైక్ పై ఎక్కించుకొని పోతున్న స్టిల్ పోస్టర్ సందడి చేస్తోంది.
బాలీవుడ్ లో హిట్టైన ఓ మై గాడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న గోపాల గోపాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక గోపాల గోపాల సినిమాలో కేవలం మూడు పాటలే ఉన్నట్లు సమాచారం. తొలుత ఈ చిత్రంలో సాంగ్స్ లేకుండా చేద్దామనుకున్నా సినిమా ఫ్లో దెబ్బతినకుండా ఇలా మూడు పాటలు ప్లాన్ చేసినట్లు చిత్ర యూనిట్ టాక్. అయితే వీటిలో ఒక పాట మాత్రం వెంకటేష్, పవన్‌ల మధ్య సాగుతుందనే వార్తలు వచ్చాయి. మరో మూడు పాటలు చరణాలు మాత్రమే వినబడి బిట్స్ లాగా అనిపిస్తాయంట. మరీ వీటిలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే జనవరి (విడుదల) వరకు ఆగాల్సిందే.
No comments:
Post a Comment