Friday, 19 December 2014

అభిమానులకు బాలయ్య న్యూఇయర్‌ గిఫ్ట్‌

అభిమానులకు బాలయ్య న్యూఇయర్‌ గిఫ్ట్‌


నందమూరి బాలకృష్ణ అభిమానులకు 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు గిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. డిసెంబర్‌ 31 అర్థరాత్రి 12 గంటలకు ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్ర టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నారు. సత్యదేవ్‌ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష, రాధిక ఆప్టే కథానాయికలుగా నటిస్తున్న చిత్రాన్ని రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బాలయ్య ఫస్ట్‌లుక్‌ ను ఇటీవల విడుదల చేశారు. మాస్‌ గెటప్‌తో లుంగీ కట్టిన బాలయ్య లుక్‌ నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదే అదిరిపోతే మరీ న్యూయర్‌ గిఫ్ట్‌ ఎలా ఉండబోతుందనే ఆసక్తితో అభిమానులు వేచి చూస్తున్నారు. 

No comments:

Post a Comment