సుభాష్ చంద్రబోస్ బతికేవున్నారంటూ కోర్టులో పిటిషన్
1962లో జరిగిన చైనా యుద్ధంలోనూ, 1964లో నెహ్రూ అంతిమయాత్రలోనూ నేతాజీ పాల్గొన్నారని తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. 1963-64 ప్రాంతంలో పశ్చిమబెంగాల్లోని సౌల్ మరి ప్రాంతంలో నేతాజీ సాధువుగా ఉన్నారన్న విషయాన్ని నిఘా విభాగం కూడా గుర్తించిందని వివరించారు.
నేతాజీ యుద్ధ నేరస్తుడు కావడంతో, ఆయనను బ్రిటీషర్లకు అప్పగిస్తామని గతంలో కేంద్రం ప్రకటించిందని, ఆ ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే, నేతాజీని అప్పగించబోమని కేంద్రం స్పష్టం చేస్తేనే ఆయనను కోర్టు ఎదుట హాజరుపరుస్తామని పిటిషనర్ తెలిపారు.
No comments:
Post a Comment