Wednesday, 17 December 2014

స్వామిని దర్శించారు.. సర్వే చేశారు

స్వామిని దర్శించారు.. సర్వే చేశారు


kcr-helicopterముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టలో ఏరియల్ సర్వే చేస్తున్నారు.  యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా ఆయన ముందుగా  లక్ష్మీనరసింహ స్వామిని దర్శించున్న అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన నివేదికలు, ప్రణాళికలపై అధికారులతో సమీక్షించారు.  లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొన్నారు.  అభివృద్ధి మండలికి సీఎం చైర్మన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆ హోదాలో సమావేశంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి.
తిరుమల తరహాలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలన్న తలంపుతో సీఎం గత అక్టోబర్17న ఇక్కడికు వచ్చిన సందర్భంలో కలెక్టర్, భువనగిరి ఆర్డీఓ, గుట్ట ఈఓలకు పలు సూచనలు చేశారు.

No comments:

Post a Comment